ఆశ్చర్యకరుడా నా ఆలోచన - ascharyakaruda song lyrics
ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు
నిత్యుడగు తండ్రివి షాలేము రాజువు
సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలిగొనినా
నీ పిల్లలు ఆకలితో అలమటింతురా
నీవున్నంత వరకు (2) " ఆశ్చర్య "
విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు
నీ పిల్లలు వారి కంటే శ్రేష్ఠులే కదా
నీవున్నంత వరకు (2) " ఆశ్చర్య "
చీకటి తొలిగే - నీతి సూర్యుడు నాలొ ఉదయించె
నీ సాక్షిగా - వెలుగుమయమై తేజరిల్లెదము
నీవున్నంత వరకు (2) " ఆశ్చర్య "
Comments