అపరాధిని యేసయ్య - aparaadhini yesayya song lyrics
అపరాధిని యేసయ్య - కృప జూపి బ్రోవుమయ్యా
నెపమెంచకయే నీ కృపలో - నపరాధములను క్షమించు(2)
1) సిలువకు నిను నే గొట్టితిని - తులువలతో జేరితిని
కలుషంబులను మోపితిని - దోషుoడ నేను ప్రభువా
" అపరాధిని "
2) ప్రక్కలో బల్లెపు పోటు - గ్రక్కున పొడిచితి నేనే
మిక్కిలి బాధించితిని - మక్కువ జూపితి వయ్యో
" అపరాధిని "
3) ముళ్ళతో కిరీటంబు - నల్లి నీ శిరమున నిదితి
నా వల్ల నేరమాయే - చల్లని దయగల తండ్రీ
" అపరాధిని "
4) దాహంబు గొనగా చేదు - చిరకను ద్రావ నిదితి
ద్రోహుండ నై చేసితిని - దేహంబు గాయంబులను
" అపరాధిని "
5) ఘోరంబుగా దూరితిని - నేరంబులను జేసితిని
క్రూరుండనై గొట్టితిని - ఘోరంబు పాపిని దేవా
" అపరాధిని "
6) శిక్షకు పాత్రుడ నయ్యా - రక్షణ తెచ్చితివయ్యా
అక్షయ భాగ్యము నియ్య - మోక్షంబు చూపితివయ్యా
" అపరాధిని "
Comments