ఆనంద యాత్ర - anandha yathra song lyrics

ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర 
యేసుతో నూతన యెరూషలేము యాత్ర - మన (2)

యేసుని రక్తము పాపములనుండి విడిపించెను (2)
వేయి నోళ్ళతో స్తుతియించినను 
తీర్చలేము ఆ ఋణమును (2)         " ఆనంద " 

రాత్రియు పగలును 
పాదములకు రాయి తగలకుండా (2) 
మనకు పరిచర్య చేయుట కొరకై 
దేవదూతలు మనకుండగా (2)         " ఆనంద " 

ఆనందం ఆనందం 
యేసుని చూచే క్షణం ఆసన్నం (2)
ఆత్మానంద భరితులమై 
ఆగమన కాంక్ష తో సాగెదం  (2)       " ఆనంద " 

Comments

Popular Posts