అనాదిలో నియమించబడిన - anadhilo niyaminchabadina song lyrics
అనాదిలో నియమించబడిన గొర్రె పిల్ల
ఆదిలో వధియించబడిన గొర్రె పిల్ల
ఇస్సాకు కు ప్రతిగా బలియైన ఆ గొర్రెపిల్ల
గొల్గొతా లో యేసు రూపమైన వధియించబడిన గొర్రెపిల్ల
వధకు తేబడిన గొర్రె పిల్ల వోలె
మౌనియాయెను బలి యాగ మాయెను
తన రుధిరముతో నన్ను కొనెను
అదియే అనాది సంకల్ప మాయెను " అనాది "
తండ్రి చిత్తమును నెర వేర్చుట కొరకై
శరీరధారియాయెను సజీవ యాగమాయెను
మరణమును గెలిచి లేచెను
అదియే అనాది సంకల్ప మాయెను " అనాది "
Comments