అనాదిలో నియమించబడిన - anadhilo niyaminchabadina song lyrics

అనాదిలో నియమించబడిన గొర్రె పిల్ల 
ఆదిలో వధియించబడిన గొర్రె పిల్ల 
ఇస్సాకు కు ప్రతిగా బలియైన ఆ గొర్రెపిల్ల
గొల్గొతా లో యేసు రూపమైన వధియించబడిన గొర్రెపిల్ల 

వధకు తేబడిన గొర్రె పిల్ల వోలె 
మౌనియాయెను బలి యాగ మాయెను 
తన రుధిరముతో నన్ను కొనెను 
అదియే అనాది సంకల్ప మాయెను        " అనాది " 

తండ్రి చిత్తమును నెర వేర్చుట కొరకై 
శరీరధారియాయెను  సజీవ యాగమాయెను  
మరణమును గెలిచి లేచెను 
అదియే అనాది సంకల్ప మాయెను       " అనాది " 

Comments

Popular Posts