యేసువంటి ప్రియబంధువు - yesu vanti priya bandhuvu song lyrics

యేసు వంటి ప్రియ బంధువు నాకీ - ఇహ పరములలో లేడన్నా = భాసుర ముగా నిజ భక్తుల కది యనుభవ గోచర మెపుడగునన్నా                                          " యేసు " 

1) ఊరు పేరు పరువులు మురువులు మరి - యూడగొట్టబడినను గాని - కూరిమితో క్రీస్తుడు మాకుండిన - కొదువ రాదు గొప్పయు పోదు                    " యేసు " 

2) ఆడికలు తిరస్కారంబులు మా కవమానము లున్నన్ గాని - కూరిమితో క్రీస్తుడు మాకుండినను త్రోవ తప్పము - ఓడి పోము                                               " యేసు " 

3) తగ్గుబాటులును సిగ్గు బాటులును - తల మీదను వాలిన గాని - దగ్గర మా పాలిట ప్రభువుండగా సిగ్గును పొందుము తగ్గున గుందము                       " యేసు " 

4) ఎన్నెన్నో శోధన బాధలు చెల రేగి మనల జుట్టిన యప్పుడు - కన్న తండ్రి వలె నోదార్చుచు దన ఘన వాగ్భలమున దునుమును వానిని               " యేసు " 

5) మనసు కృంగి పలు చింతల చేత మట్ట బడిన వేళను మాకు - తన వాగ్దత్త ములను జేతుల లే - వనెత్తి ఎంతో -
సంతస మోసగును                                  " యేసు " 

6) తలి దండ్రులు విడిచిన గాని - తాను వదల డెప్పుడు -
మమ్ము = ఉల్లమునెత్తి పిలిచిన వేళ - నోహో యనుచు దరికి వచ్చు                                           " యేసు " 

7) అతడుండని పరమండలము  ఇక వెదకిన గాని యగపడదు క్షతి నాతడు మా మతిని వసించిన అతులిత సౌఖ్యం బదియే మోక్షము                       " యేసు " 

Comments

Popular Posts