యోహోవ నా మొర లాలించెను - yehova na mora song lyrics

యెహోవ నా మొర లాలించెను - దన మహా దయను నను గణించెను - అహర్నిశల ధీనహీనడగు నా - దుహానెడు ధ్వని గ్రహించి మనిపెను                         " యెహోవ " 


1) పిశాచి గడిమి పడగట్టెను - దన వశాన నను నిలువబెట్టెను - ప్రశాంత మధుర సు విశేష -  వాక్ఫల నిశాంత మున జేర్చి చేరదీసెను               " యెహోవ " 

2) మదావలమున్ బోవు నా మదిన్ - దన ప్రదీప్త వాక్యాo
కూశా  హతిన్ - యధేచ్చలన్నిటి గుదించి పాపపు మొదల్ తుదల్ నరికి దరికి చేర్చెను                    " యెహోవ " 

3) అనీతి వస్త్రమే డలించెను - యేసు నాధు రక్తమున ముంచెను = వినూత్న యత్నమే - దనూని ఎన్నడు గనన్ వినన్ బ్రేమ నాకు చూపెను                   " యెహోవ "

4) విలాపములకు జెవినిచ్చెను = శ్రమ కలాపములకు  సెలవిచ్చెను - శిలా నగము పై కిలాగి నను సుఖ కలావళుళ్ మనసులోన నిలిపెను                         " యెహోవ " 

5) అగణ్య పాపి యని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక తెగించి మృతి కొ - ప్పగించి పాపపు నెగుల్ దిగుల్
 సొగసుగా ననంచెను                          " యెహోవ " 

Comments

Popular Posts