వింతైన తారక వెలిసింది - vinthaina tharaka velisindi song lyrics

వింతైన తారక వెలిసింది గగనాన 
యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన (2) 
జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరన 
దైవమే పంపెనని గ్రాహియించు హృదయాన (2) 
మనమంతా జగమంతా 
తార వలె క్రీస్తుని చాటుదాం  (2) 
హ్యాపీ క్రిస్మస్ మేరి క్రిస్మస్ 

ఆకాశమంత ఆ ధూతలంతా
 గొంతెత్తి స్తుతి పాడగా 
సర్వోన్నతమైన స్థలముల లోన 
దేవునికే నిత్య మహిమ (2)
భయముతో భ్రమలతో ఉన్న గొఱ్ఱెల కాపరులన్ 
ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి  " మనమంతా " 

ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు
యేసయ్య ని దర్శించిరి (2)
ఎంతో విలువైన కానుకలు అర్పించి 
రారాజుని పూజించిరి (2)
హేరోదుకు పుర జనులకు శుభ వార్త చాటిరి 
అవనిలో వీరును దూతలై నిలిచిరి        " మనమంతా " 



Comments

Popular Posts