వినరేయో నరులారా - vinare yonarulara

వినరేయో నరులారా వీనుల కింపుమీరు మనుల రక్షింప క్రీస్తు మనుజావ తారుండయ్యో వినరే - అనుదినమును 
దేవుని తనయుని పద వనజంబులు మన మున నిడికొనచును                                        " వినరే " 

1) 
నరరూపు బూని ఘోర నరకుల రారమ్మని దురితమున్
బాపు దొడ్డ దొరయో మరియా వర పుత్రుండు కర మరు దగు కల్వరి గిరి దరికరి గిరయంబున ప్రభు కరుణను గనరే 
                                                          " వినరే " 

2) 
ఆనందకరమైన మోక్ష మందరి కియ్య దీక్ష బూని తనమేని 
సిలువ మ్రాను నణచి మృతి బొందెను దీన దయా పరుడైన మహాత్ముడు జానుగ యాగము సలిపిన తెరంగిది 
                                                        " వినరే " 

3) 
పొందు గోరిన వారి విందా పరమోప కారి ఎందరెందరి బరమా నంద పద మొందగా జేసేను  అందమునన్ దన బొంది సురక్తము జిందెను భక్తుల డేందము గుందగా 
                                                      " వినరే " 

4)
ఇల మాయా వాదుల మాని ఇతడే సద్గురుడని తల పోసి చూచి మతి నిశ్చల భక్తిని గొలిచిన వారికి నిల జనులకు గలు ములనలరెడు ధనికుల కందని సుఖములు మరి 
యోసగును                                    " వినరే "

5)
దురితము లనప వచ్చి మరణమై తిరిగి లేచి నిరత మోక్షనంద సుందర మందిరమున కరుదుగన్ జనె బిరబిర
మనమందరమా కరుణా శరనిధి చరణమే శరణని పోదము                                       " వినరే " 




       

Comments

Popular Posts