వచ్చింది క్రిస్మస్ వచ్చింది - vachindi christmas vachindi song lyrics
వచ్చింది క్రిస్మస్ వచ్చింది - తెచ్చింది రక్షణ తెచ్చింది
ఊరు వాడా పల్లె పల్లెల్లోన
ఆనందమే ఎంతో సంతోషమే (2)
మన చీకటి బ్రతుకులోన
ప్రభు యేసు జన్మించెను (2)
రారండోయ్ వేడుక చేద్దాం
కలిసి రారండోయ్ పండుగ చేద్దాం (2) " వచ్చింది "
దావీదు పట్టణములో - బేత్లెహేము గ్రామములో
కన్య మరియ గర్భము నందు బాలునిగా జన్మించెను (2)
అంధకారమే తొలగి పోయెను
చీకు చింతలే తీరి పోయెను (2) " మన చీకటి "
ఆకాశం లో ఒక దూత - పలికింది శుభవార్త
మన కొరకు రక్షకుడేసు - దీనునిగా పుట్టాడని (2)
పాప శాపమే తొలగించుటకు
గొప్ప రక్షణ మనకిచ్చుటకు (2) " మన చీకటి "
Comments