ఉన్నపాటున వచ్చుచున్నా - unna paatuna vacchuchunna song lyrics
ఉన్నపాటున వచ్చు - చున్నాను నీ పాద - సన్నిధి కో రక్షకా - యెన్న శక్యము గాని పాపము లన్ని మోపుగా వీపు పై బడి యున్న విదె నడలేక తొట్రిలు చున్న వాడను - నన్ను దయగను "ఉన్న పాటు "
1) కారుణ్య నిధి యేసు నా రక్షకా నీ శ - రీర రక్తము చిందుట భూరి దయతో నన్ను నీ దరి చేర - రమ్మని పిలుచటయు నీ ష్కారణపు నీ ప్రేమ ఇది మరి వేరే హేతువు లేదు నా యెడ "ఉన్న పాటు "
2) మసి బొగ్గు వలె నా మా - నస మెల్ల గప్పె దోష సమూహములు మచ్చలై అసిత మగు ప్రతి డాగు తుడువను గసుడు గడిగి పవిత్ర పరపను - అసువులిడు నీ రక్తమే యని - మాసల కిప్పుడు సిలువ నిదె గని
" ఉన్న పాటు "
3) వెలుపట బహు యుద్ధములు - లోపటను భయము - కలిగె నెమ్మది దొలాగెను - పలువిధములగు సంధియంబుల - వలన పోరాటములచే నే నలసి ఇటునటు గొట్టబడి దు-ర్భలుడనై గాయములతో నిదె
" ఉన్న పాటు "
4) కడు బీద వాడ - నంధుడను దౌర్భాగ్యుడను చెడి పోయి పడియున్నాను - సుడి వడిన నా మదికి స్వస్థత - చెడిన కనులకు దృష్టి భాగ్యము - బడయ వలసిన వన్ని నీచే బడయుటకు నా ఎడ యడా ఇదె " ఉన్న పాటు "
5) నీ వాగ్దత్తము నమ్మి - నీపై భారము పెట్టి - జీవ మార్గము గంటిని - కేవలంబగు ప్రేమ చేతను నీవు నన్ను క్షమించి చేకొని భావ శుద్ధి నొనర్చి సంతోషవసరముల నిడుదువని ఇదె " ఉన్న పాటు "
6) దరిలేని యానంద కరమైన నీ ప్రేమ తరమే వర్ణన చేయను తెరవు కడ్డంబైన యన్నిటి - విరుగ గొట్టెను గాన నే నిపు డరుదుగా నీ వాడ నవుటకు మరి నిజము నీ వాడ నవుటకే " ఉన్న పాటు "
Comments