త్రాహిమాం క్రీస్తు నాధ - thraahimam kreesthu nadha song lyrics

 త్రాహిమాం క్రీస్తు నాధ రావే = నేను దేహి యనుచు నీ పాదములే - దిక్కుగాన్ జేరితి నిపుడు     " త్రాహి " 

1) గవ్వరాని చెడ్డ - కర్మేంద్రియాధీనుడనై - రవ్వ పాలై నే నెంతో నెవ్వ పొందితిన్  - త్రవ్వు చున్న కొలది పెరుగు - దరగదు నా పాప రాశి - యవ్విధమున చెడి పోతిని నే - నేమి సేతు నోహోహోహో  ...                 " త్రాహి "  

2) నీయందు భయభక్తులు లేని - నిర్లజ్జా చిత్తము బూని -
చేయరాని దుష్కర్మములు - చేసి నాడను - దయ్యాల రాజు చేతిలో  - జేయి వేసి వాని పనులన్ - జేయ సాగి నే - నిబ్బంగి చెడి పోతినే నయ్యయ్యయ్యో   " త్రాహి " 

3) నిబ్బర మెక్కించుకైన నిజము రవ్వంతైన లేక - దబ్బర లాడుటకు - ముత్తానైతిని = అబ్బురమైన ఘోర పా పాంధ కార కూపమందు దబ్బున బడి పోతి నయ్యో దారి చెడి నే నబ్బబ్బబ్బా                                      " త్రాహి " 

4) నిన్ను జేరి సాటి లేని - నిత్యానంద మంద బోవు  - చున్నప్పుడు నిందలు  - నా కెన్ని చేరినా - విన్నదనము లేకుండా  నీ - వే నా మదికి ధైర్యమిచ్చి - యన్నిట రక్షించి తివి నా  - యన్న నీకు స్తోత్ర  మహాహా  " త్రాహి " 

Comments

Popular Posts