సుధామధుర కిరణాల - sudhaa madhura kiranala song lyrics
సుధామధుర కిరణాల అరుణోదయం
కరుణా మయుని శరణం అరుణోదయం (2)
తెరమరుగు హృదయాలు వెలుగైనవి
మరణాల చెరసాల మరుగైనది (2)
దివిరాజుగా భువికి దిగినాడని
రవి రాజుగా ఇలను మిగిలాడని (2)
పరలోక గగనాలు పిలిచాడని
పరలోక భవనాలు తెరిచాడని (2)
ఆరని జీవన జ్యోతిగ వెలసిన తారకటొచ్చింది
పాడి పంటల పశువుల పాకను ఊయల చేసింది (2)
నిను పావగా నిరు పేదగా జన్మించెగా ఇల పండుగ (2)
" సుధామధుర "
లోకాలలో పాప శోకలలో ఏకకులై
ఏకాకులా బ్రతుకు అవివేకులు (2)
క్షమ హృదయ సహనాలు సమపాళ్ళుగా
ప్రేమానురాగాలు స్థిర ఆస్తి గా (2)
నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడాయేసే
నిత్య సుఖాల జీవ జలాల పెన్నిధి ఆ ప్రభువే (2)
ఆ జన్మమే ఒక మర్మము ఆ బంధమే అనుబంధము (2)
" సుధామధుర "
Comments