శ్రీ యేసుండు జన్మించె - sree yesundu janminche song lyrics

శ్రీ యేసుండు జన్మించె రేయిలో 
నేడు పాయక బేత్లెహేము యూరిలో   " శ్రీ యేసుండు " 

కన్నీయ మరియమ్మ గర్భమందున 
నిమ్మనుయేలనెడి నామమందున      " శ్రీ యేసుండు " 

సత్రమందున పశువుల సాలయందున 
దేవ పుత్రుండు మణుజుండాయెనందున 
                                                    " శ్రీ యేసుండు " 
పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి 
పశుల తొట్టిలో బరుండ బెట్ట బడి     " శ్రీ యేసుండు " 

గొల్ల లెల్లరు మిగుల భీతిల్లగా 
దెల్పే గొప్ప వార్త దూత చల్లగా         " శ్రీ యేసుండు " 

మన కొరకొక్క శిశువు పుట్టెను 
ధరను మన దోషముల బోగొట్టను   " శ్రీ యేసుండు " 

పరలోకపు సైన్యంబు గూడెను 
మింట వరరక్షకుని గూర్చి పాడెను   " శ్రీ యేసుండు "

రక్షకుండగు యేసు వచ్చెను 
మనకు రక్షణంబు సిద్ధ పరచెను     " శ్రీ యేసుండు " 


Comments

Popular Posts