శీతాకాలంలో క్రిస్మస్ - sheethakalam lo krismas song lyrics

శీతాకాలం లో క్రిస్మస్ కాంతులతో 
జనియించిన శ్రీ యేసుని నీడలో 
చీకు లేదు చింత లేదు చాలా సంతోషం
బాధ లేదు భయము లేదు భలే ఆనందం 
హ్యాపీ క్రిస్మస్ మేరి క్రిస్మస్ 

యకోబుల నక్షత్రం ఉదయించెను 
తూర్పు దేశ జ్ఞానులు గుర్తించెను 
బెత్లెహేములో యేసుని చూచి కనుకలిచ్చెను  నాడు 
ఆరాధించి ఆనందించి యేసుని చాటెను చూడు  " శీతా "

పొలమందు కాపారులకు దూత చెప్పెను 
రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు 
పశువుల తొట్టిలో ప్రభువును చూచి 
పరవశం మొందినవారు 
అవి విన్నవాటిని ప్రచురము చేసి 
మహిమ పరచెను చూడు                                " శీతా " 

Comments

Popular Posts