రారే చూతము రాజ సుతుని - rare chuthamu song lyrics
రారే చూతము రాజ సుతుడీ రేయి జనన మాయెను
రాజులకు రారాజు మెస్సియ రాజితంబగు తేజమదిగో (2)
" రారే చూతము "
దూత గణములన్ దేరి జూడరే దైవ వాక్కులన్ దెల్పగా
దేవుడే మన దీన రూపున ధరణికరిగే నీ దినమున (2)
" రారే చూతము "
కల్ల కాదిది కలియు గాదిది గొల్ల బోయల దర్శనం
తెల్ల గానదే తేజ రిల్లెడి తార గాంచను త్వరగా రారే (2)
" రారే చూతము "
బాలుడడుగో వేల సూర్యుల బోలు సద్గుణ శీలుడు
బాల బాలిక బాల వృద్ధుల నేల గల్గిన నాధుడు (2)
" రారే చూతము "
యూద వంశము నుద్ధరింప దావీదు పురమున
నుద్భవించే - సదమలంబగు మదిని గొల్చిన
సర్వజనులకు సార్వ భౌముడు (2)
" రారే చూతము "
Comments