రారాజు పుట్టాడోయ్ - raraju puttadoy song lyrics
రారాజు పుట్టాడోయ్ మా రాజు పుట్టాడోయ్
సూడంగా రారండోయ్ వేడంగా రారండోయ్
ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినడండోయ్
నింగి నేల పొంగి పోయే ,
ఆ తార వెలసి మురిసిపోయే ,
సంబరమాయెనే , హోయ్
1)
వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట
ఊరు వాడ వింతబోయే గొల్లల సవ్వడులు
కన్నులు విందుగా దూతలు పాడగా
సందడే సిందేయంగా మిన్నుల పండుగ
సుక్కల్లో సంద్రుడల్లే సూడ సక్కనోడoట
పశుల పాకలోన ఆ పసి బాలుడoట
చెరగని స్నేహమై
2)
మచ్చలేని ముత్యమల్లే పొడిచే సూర్యుడు
మనసులో దీపమై దారి సూపు దేవుడు
ప్రేమ పొంగు సంద్ర మల్లే , కంటికి రెప్పలా
అందరి తోడు నీడై మాయని మమతలా
సల్లంగ సూడు యేసు ఇల వచ్చినాడంట
వరముగా చేరు యేసు పరమును వీడేనంట
మరువని బంధమై
Comments