రండి యుత్సాహించి పాడుదము - randi yuthsahinchi padudhamu song lyrics

రండి యుత్సాహించి పాడుదము 
రక్షణ దుర్గము మన ప్రభువే (2) 

1) రండి కృతజ్ఞతా స్తోత్రముతో రారాజు సన్నిధి కేగుదము 
సత్ప్రభు నామము కీర్తనలన్ - సంతోష గానము చేసేదము                                          " రండి " 

2) మన ప్రభువే మహా దేవుండు ఘన మహాత్మ్యము గల రాజు - భూమ్యాగాధపు లోయలును 
భూధర శిఖరము లాయనవే 
                                                       " రండి " 

3) సముద్రము సృష్టించె నాయనదే సత్యుని హస్తము భువి చేసెన్ - ఆయన దైవము పాలితుల - మాయన మేపెడి గొర్రెలము                                         " రండి " 

4) ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కుదము - ఆయన మాటలు గైకొనిన నయ్యవి మనకెంతో మేలగును                        " రండి " 

5)  తండ్రి కుమార శుద్ధాత్మ కును దగు స్తుతి మహిమలు కల్గు గాక -  ఆదిని నిప్పుడు నెల్లప్పుడు  నయినట్లు  యుగములు  నౌను ఆమెన్                "రండి " 
  

Comments

Popular Posts