రండి యుత్సాహించి పాడుదము - randi yuthsahinchi padudhamu song lyrics
రండి యుత్సాహించి పాడుదము
రక్షణ దుర్గము మన ప్రభువే (2)
1) రండి కృతజ్ఞతా స్తోత్రముతో రారాజు సన్నిధి కేగుదము
సత్ప్రభు నామము కీర్తనలన్ - సంతోష గానము చేసేదము " రండి "
2) మన ప్రభువే మహా దేవుండు ఘన మహాత్మ్యము గల రాజు - భూమ్యాగాధపు లోయలును
భూధర శిఖరము లాయనవే
" రండి "
3) సముద్రము సృష్టించె నాయనదే సత్యుని హస్తము భువి చేసెన్ - ఆయన దైవము పాలితుల - మాయన మేపెడి గొర్రెలము " రండి "
4) ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కుదము - ఆయన మాటలు గైకొనిన నయ్యవి మనకెంతో మేలగును " రండి "
5) తండ్రి కుమార శుద్ధాత్మ కును దగు స్తుతి మహిమలు కల్గు గాక - ఆదిని నిప్పుడు నెల్లప్పుడు నయినట్లు యుగములు నౌను ఆమెన్ "రండి "
Comments