రండి సువార్త సునాదముతో - randi suvartha sunadhamutho song lyrics

రండి సువార్త నాదముతో 
రంజిలు సిలువ నినాదముతో 
తంబుర సితార నాదముతో 
ప్రభు యేసు దయానిధి సన్నిధికి 

1) యేసే మానవ జాతి వికాసం 
    యేసే మానవ నీతి విలాసం 
    యేసే పతిత పావన నామం 
    భాసుర క్రైస్తవ శుభనామం          " రండి " 

2) యేసే దేవుని ప్రేమ స్వరూపం 
    యేసే సర్వేశ్వర ప్రతి రూపం 
    యేసే ప్రజా పతి పరమేశం 
    ఆశ్రిత జనముల సుఖ వాసం      " రండి " 

3) యేసే సిలువను మోసిన దైవం 
    యేసే ఆత్మల శాశ్వత జీవం 
    యేసే క్షమాపన అధికారం 
    దాసుల ప్రార్థన సహకారం          " రండి " 

4) యేసే సంఘములో మన కాంతి 
    యేసే హృదయములో ఘన శాంతి 
    యేసే కుటుంబ జీవన జ్యోతి 
    పసి పాపాల దీవెన మూర్తి         " రండి " 

5) యేసే జీవన ముక్తికి మార్గం 
    యేసే భక్తుల భూతల స్వర్గం 
    యేసే ప్రపంచ శాంతికి సూత్రం 
    వాసిగ నమ్మిన జన స్తోత్రం        " రండి " 
 

Comments

Popular Posts