రక్షకుండుదయించి నాడట - rakshakundu undhani chinadata

రక్షకుండుదయించి నాడట మన కొరకు  బరమ 
రక్షకుండుదయించి నాడట - రక్షకుండుదయించి నాడు
రారే గొల్ల బోయలార - తక్షణమున బోయి మన నిరీక్షణ 
మొందుదము  (2)                                  " రక్షకుండు " 


దావీదు వంశమందు ధన్యుడు జన్మించి నాడు దేవుడగు
యెహోవా మన దిక్కు దేరి చూచినాడు     " రక్షకుండు " 

  
గగనము డిగ్గి ఘనుడు గాబ్రియేలు దూత తగినట్టు చెప్పేవారికి  మిగుల సంతోష వార్త            " రక్షకుండు "


వర్తమానము చెప్పి దూత వైభవమున పోవుచున్నాడు 
కర్తను  జూచిన వెనుక కాంతుము విశ్రమంబప్పుడు 
                                                          " రక్షకుండు " 

పశువుల తొట్టి లోన భాసిల్లు వస్త్రముల జుట్టి శిశువును కను గొందురని శీఘ్రముగను దూత దెల్పి
                                                          " రక్షకుండు " 

అనుచు గొల్ల లొకరి కొకరానవాలు జెప్పుకొనుచు అనుమతించి కడకున్ క్రీస్తు నందరికినీ దెల్పినారు
                                                    




Comments

Popular Posts