రక్షకుండుదయించి నాడట - rakshakundu undhani chinadata
రక్షకుండుదయించి నాడట మన కొరకు బరమ
రక్షకుండుదయించి నాడట - రక్షకుండుదయించి నాడు
రారే గొల్ల బోయలార - తక్షణమున బోయి మన నిరీక్షణ
మొందుదము (2) " రక్షకుండు "
దావీదు వంశమందు ధన్యుడు జన్మించి నాడు దేవుడగు
యెహోవా మన దిక్కు దేరి చూచినాడు " రక్షకుండు "
గగనము డిగ్గి ఘనుడు గాబ్రియేలు దూత తగినట్టు చెప్పేవారికి మిగుల సంతోష వార్త " రక్షకుండు "
వర్తమానము చెప్పి దూత వైభవమున పోవుచున్నాడు
కర్తను జూచిన వెనుక కాంతుము విశ్రమంబప్పుడు
" రక్షకుండు "
పశువుల తొట్టి లోన భాసిల్లు వస్త్రముల జుట్టి శిశువును కను గొందురని శీఘ్రముగను దూత దెల్పి
" రక్షకుండు "
అనుచు గొల్ల లొకరి కొకరానవాలు జెప్పుకొనుచు అనుమతించి కడకున్ క్రీస్తు నందరికినీ దెల్పినారు
Comments