కోటి కాంతుల వెలుగులతో - కోటి కాంతుల వెలుగులతో song lyrics
కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం
లోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణం
దివిని విడిచి భువిని మనకై మానవునిగా జన్మించెను
దిగులు చెందక గతము మరచి యేసుని ఆరాధింతుము
లోకానికే ఇది పర్వదినం మహదానందమే ప్రతి క్షణం (2)
" కోటి కాంతుల "
రాజులకు రాజుల రాజు ప్రభువులకు ప్రభువే తానుగా
మనుజులకు మాదిరి తానై ఉండుటకే ఇల ఏతెంచెగా (2)
మనకోసమే జన్మించెను తన ప్రేమనే పంచెను
ఆ వరమునే తను విడిచెను నరరూపిగా వెలసెను
దృష్టికి ములాధారమైన దేవుడే ఇల దిగి వచ్చెనా
శోధనా బాధలు ఎన్ని ఉన్నా నేటితో ఇక దరి చేరునా
ఆనందమే ఇకసంతోషమే ప్రతివానికి శుభపరిణామమే (2)
" కోటి కాంతుల "
మహిమ గల మహోన్నతుడు పశుశాలలో పసివానిగా
కరుణగల కారణజన్ముడు శిశువుగా మనలోఒకవానిగా(2)
ఏనాటికి మనకు తోడుగా ఉండాలని అండగా
ప్రతివానికి స్నేహితునిగా హృదయాన జన్మించెగా
అంధకారపు ఈ లోకమందు దేవ దేవుడు ఉదయించెగా
ఎన్నడూ లేని వేవేల కాంతులు లోకమందున పవలించెగా
సంతోషమే సమాధానమే ఇది దేవాదిదేవుని
Comments