రాజాధి రాజా రారా - rajadhi raja rara song lyrics

రాజాధి రాజా రారా - రాజులకు రాజువై రారా - రాజ యేసు రాజ్య మేల రారా - రవి కోటి తేజ యేసు రారా 
ఓ ... మేఘ వాహనంబు మీద వేగమే - ఓ ... మించు వైభవంబు తోడ వేగమే                           " రాజాధి " 

1) ఓ ... భూజనంబు లెల్ల తేరి చూడగా 
    ఓ ... నీ జనంబు స్వాగతంబు నీయగా 
    నీ రాజ్య స్థాపనంబు సేయ - భూ రాజు లెల్ల గూలి పోవ 
    భూమి యాకసంబు మారి పోవ - నీ మహా ప్రభావమున      వేగ                                                 " రాజాధి " 

2) ఆ ... ఆకాసమున దూతలార్భటింపగా 
    ఆ ... ఆది భక్తసంఘ సమేతంబుగా 
    ఆకసంబు మధ్య వీధి లోన - ఏకమై మహా సభ చేయ 
    యేసు నాధ నీదు మహిమ లోన మాకదే                          మహానందమౌగ                               " రాజాధి " 

3) ఓ ... పరమయెరుషలేము పుణ్య సంఘమా 
    ఓ ... గొరియపిల్ల క్రీస్తు పుణ్య సంఘమా 
    పరమ దూత లారా... భక్తులారా ... పౌలపోస్తులారా..
    పెద్ద లారా .. గొరియ పిల్ల యేసు రాజు పేర 
    క్రొత్త గీతమెత్తి పాడరారా                  " రాజాధి " 

Comments

Popular Posts