నీవేయని నమ్మిక - neve ani nammika song lyrics

నీవే యని నమ్మిక - యేసు నాకు నీవే యని నమ్మిక 
నీవే మార్గంబు నీవే సత్యంబు - నీవే జీవంబు - నీవే సర్వంబు                                                   " నీవే " 

1) పెడ దారిని బోవగా నా మీదికి ఇడుమ లెన్నియో రాగా
    అడవిలో బడి నేను ఆడలుచు నుండగా - తడవ                కుండా దొరుకు ధన్యమౌ మార్గంబు          " నీవే " 

2) కారు మేఘము పట్టగా - నా మనసులో - కటిక చీకటి        పుట్టగ  - ఘోర బాధలు చేరు దారి అని భ్రమపడగా            తేరీచూడ  గల్గు తేజోమయ మార్గంబు    " నీవే "   

3) లేని పోని మార్గంబు లెన్నోయుండ జ్ఞానోపదేశంబు            మనుగా  జేయుచు - వానిని ఖండించి - నేనే మార్గంబ
    న్న నిజమైన మార్గంబు                         " నీవే " 

4) నరలోకము నుండి పరోకంబు - వరకు నిచ్చెనగా నుండి 
    నరులకు ముందుగ నడుచుచు ముక్తికి - సరిగా                  కొనిపోవును - స్థిరమైన మార్గంబు         " నీవే " 


    

 
    

Comments

Popular Posts