నన్ను దిద్దుము - nannu diddhumu song lyrics
నన్ను దిద్దుము చిన్న ప్రాయము - సన్నుతుండగు నాయనా - నీవు కన్న తండ్రి వనుచు నేను నిన్ను చేరితి నాయనా
1) దూరమునకు బోయి నీ దరి చేరనైతిని నాయనా = నేను కారు మూర్ఖపు పిల్లనై కా - రడవి తిరిగితి నాయనా
" నన్ను "
2) మంచి మార్గము లేదు నాలో మరణ పాత్రుoడ నాయనా - నేను వంచి తుండ నైతిని ప్రపంచనందున నాయనా " నన్ను "
3) చాల మారులు తప్పి పోతిని మేలు గానక నాయనా - నా చాల మొరలనాలకించుము జాలి గల నా నాయనా
" నన్ను "
4) జ్ఞానమంతయు బాడు చేసి కాన నైతిని నాయనా - జ్ఞానము గల తండ్రి వనుచు జ్ఞప్తి వచ్చెను నాయనా
" నన్ను "
5) కొద్ది నరుడను దిద్ది నను నీ యొద్ద చేర్చుము నాయనా - నీ యొద్ద చేర్చి బుద్ధి చెప్పుము మొద్దు నైతిని నాయనా
" నన్ను "
6) ఎక్కడను నీ వంటి మార్గము - నెఱుఁగ నైతిని నాయనా - నీ రెక్క చాటున నన్ను చేర్చి చక్క పరచుము నాయనా
" నన్ను "
7) శత్రువగు సాతాను నన్ను మిత్రు జేయను నాయనా - యెన్నో సూత్రములు గల్పించెను నా నేత్రములకో నాయనా
" నన్ను "
8) వాసి గా నే పాప లోకపు వాసుడా నో నాయనా - నీ దాసులలో నొకనిగా నను జేసీ కావుము నాయనా
" నన్ను "
Comments