క్రీస్తే సర్వాధి కారి - kreesthe sarvadhi kaari song lyrics

క్రీస్తే సర్వాధి కారి - క్రీస్తే మోక్షాధి కారి 
క్రీస్తే మోహపకారి - క్రీస్తే ఆ సిల్వాధారి 

1) ముక్తి విధాత నేత శక్తి నొసంగు దాత 
    భక్తి విలాప శ్రోత పరమంబు వీడె గాన  

2) దివ్య పథంబు రోసి దైవంబు తోడు బాసి 
    దాసుని రూపు దాల్చి ధరణి కేతెంచె గాన 

3) శాశ్వత లోక వాసి సత్యామృతంపురాశి
    శాప భారంబు మోసి శ్రమల సహించె గాన 

4) సైతాను జనము గూల్పన్ పాతాళ మునకున్ బంపన్
    నీతి పథoబు బెంప రుధిరంబు గార్చే గాన 

5) మృత్యువు ముళ్ళు తృoపన్ నిత్య జీవంబు బెంపన్ 
     మర్త్యాళి భయము దీర్పన్ మరణంబు గెలిచె గాన 

6) పరమంబు దివిజులైన ధరయందు మనుజులైన  
    ప్రతి నాలుక మొకాలు ప్రభునే భజించు గాక 

7) ఈ నామమునకు మించు నామంబు లేదటంచు 
     యెహోవా తండ్రి యేసున్ హెచ్చించి నాడు గాన 

Comments

Popular Posts