హృదయమనెడు తలుపు - hrudhayamanedu thalupu song lyrics
హృదయమనెడు తలుపు నొద్ద యేసు నాధుండు = నిలిచి సదయు డగుచు దట్టుచుండు - సకల విధములను
1) పరుని పోలి నిలుచున్నాడు పరికించి చూడ - నతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు " హృదయ "
2) కరుణా శీలుం డతడు గానఁ - గాచి యున్నాడు యేసు కరుణ నెరిగి గారవింపఁ గరము న్యాయంబు" హృదయ "
3) ఎంత సేపు నిలువ బెట్టి ఏడ్పిoతు రతని = నాతన్ డెంతో దయచే బిలుచుచున్నాడుప్పుడు మిమ్ములను
" హృదయ "
4) అతడు మిత్రుడతడు - మిత్రుo - డఖిల పాపులకు మిర - లతని పిలుపు వింటిరేని - యతడు ప్రియుడగును
" హృదయ "
5) జాలి చేత తన హస్తములన్ - జాపి యున్నాడు = మిమ్ము నాలింగనము చేయ గోరి యనిశము కనిపెట్టు
" హృదయ "
6) సాటి లేని దయగల వాడు - సర్వేశు సుతుండు = తన మాట వినెడు వారల నెల్ల సూటిగ రక్షించు " హృదయ "
7) చేర్చు కొనుడి మీ హృదయమున శ్రీ యేసు నాధు - నతడు చేర్చు కొనుచు మీకిచ్చును - చిర జీవమున్ గృపను " హృదయ "
8) అతడు తప్పక కలుగ జేయు నఖిల భాగ్యములు - మీర లతని హత్తుకొందు రప్పు దానందము తోడ
" హృదయ "
9) బ్రతుకి శాశ్వతంబు కాదు - పరికించి చూడన్ -గాన బ్రతికి యుండు కాల ముననే - ప్రభుని గొలువండి
" హృదయ "
Comments