ఈలాటిదా యేసు ప్రేమ - eelatidha yesu prema song lyrics

 ఈలాటిదా యేసు ప్రేమ - నన్ను = తూలనాడక తనదు 
జాలి చూపినదా                                 " ఈలాటిదా " 

ఎనలేని పాప కూపమున - నేను తనకి మిణుగుచును నే దరి గానగుండన్ కనికరము పెంచి నా యందు - వేగ గొని పోవ నా మేలు కొరికిందు వచ్చె            " ఈలాటిదా " 

పెన గొన్న దుఃఖాబ్ది  లోన - నేను మునిగి కుములుచు నేడు పునగుండు నపుడు నను నీచుడని త్రోయలోక  - తనదు నెనరు నా కగుపరచి  నీతి చూపించె    " ఈలాటిదా " 

నెమ్మి రవ్వంతైన లేక - చింత క్రమ్మి పొగలుచు నుండ - గా నన్ను చూచి సమ్మతిని నను బ్రోవ దలచి - కరము చూచి నా చేయి పట్టి చక్కగా పిలిచె              "ఈలాటిదా "

పనికి మాలిన వాడనైన నేను కనపరచు నా దోష కపట వర్తనము మనసు నుంచక తాప పడక ఇంత ఘనమైన రక్షణ మును నాకు చూపే                  " ఈలాటిదా " 

నా కోర్కెలెల్ల సమయములన్ - క్రింది లోక వాంఛల భ్రమసి లొంగెడు వేళన్ చేకూర్చి ధృడము చిత్తమునన్ - శుభము నా కొసంగె జీవింప రక్షకుండు            "ఈలాటిదా " 

శోధనలు నను చుట్టినప్పుడు - నీతి బోధ నా మనసులో 
పుట్టించి పెంచి బాధలెల్లను బాపి మాపి ఇట్టి యాదరణ జూపిన - య హా హా యేమందు        "ఈలాటిదా " 
 

Comments

Popular Posts