ఈలాటిదా యేసు ప్రేమ - eelatidha yesu prema song lyrics
ఈలాటిదా యేసు ప్రేమ - నన్ను = తూలనాడక తనదు
జాలి చూపినదా " ఈలాటిదా "
ఎనలేని పాప కూపమున - నేను తనకి మిణుగుచును నే దరి గానగుండన్ కనికరము పెంచి నా యందు - వేగ గొని పోవ నా మేలు కొరికిందు వచ్చె " ఈలాటిదా "
పెన గొన్న దుఃఖాబ్ది లోన - నేను మునిగి కుములుచు నేడు పునగుండు నపుడు నను నీచుడని త్రోయలోక - తనదు నెనరు నా కగుపరచి నీతి చూపించె " ఈలాటిదా "
నెమ్మి రవ్వంతైన లేక - చింత క్రమ్మి పొగలుచు నుండ - గా నన్ను చూచి సమ్మతిని నను బ్రోవ దలచి - కరము చూచి నా చేయి పట్టి చక్కగా పిలిచె "ఈలాటిదా "
పనికి మాలిన వాడనైన నేను కనపరచు నా దోష కపట వర్తనము మనసు నుంచక తాప పడక ఇంత ఘనమైన రక్షణ మును నాకు చూపే " ఈలాటిదా "
నా కోర్కెలెల్ల సమయములన్ - క్రింది లోక వాంఛల భ్రమసి లొంగెడు వేళన్ చేకూర్చి ధృడము చిత్తమునన్ - శుభము నా కొసంగె జీవింప రక్షకుండు "ఈలాటిదా "
శోధనలు నను చుట్టినప్పుడు - నీతి బోధ నా మనసులో
పుట్టించి పెంచి బాధలెల్లను బాపి మాపి ఇట్టి యాదరణ జూపిన - య హా హా యేమందు "ఈలాటిదా "
Comments