దివి నుండి భువికి - divi nundi bhuviki song lyrics

దివి నుండి భువికి రారాజుగా 
బేత్లెహేము పురముకు ఏతెంచెను  (2)

గ్రామమంతా చిరునవ్వు లొలికే 
పట్టణ మంతా పండుగ చేసే (2) 
సర్వ లోకము సంబరమాయే (2)

ఆశ్చర్యకరుడు హల్లెలూయ
బలమైన దేవుడు హల్లెలూయ 
నిత్యుడగు తండ్రి హల్లెలూయ 
సమాధాన కర్త  హల్లెలూయ 

గొల్లలు జ్ఞానులు పరవశులై 
బంగారం సాంబ్రాణి బోలమును (2)
సాష్టాంగ పడి తమ హృదయములన్ 
ప్రభువుకు కానుకలర్పించిరి 
మనము కూడా అర్పించెదమ్ 
ప్రభువు నామము ఘనపరచెదమ్ 
మనము కూడా సాష్టాంగ పడుచు 
పరవసించుచు పాడెదము            " ఆశ్చర్య కరుడు " 

పాపము శాపము బాపగను 
వేదన శోధన తీర్చగను (2)
పరిశుద్ధుడు జన్మించినని 
ఇహమున పరమున కొనియాడెదమ్
మనముకూడ కొనియాడెదమ్ 
ప్రభువు నామము ఘనపరచెదమ్ 
మనము కూడా హోసన్నా యనుచు 
కరములెత్తి పాడెదము        
 
 " ఆశ్చర్య కరుడు"             " దివి నుండి భువికి " 








Comments

Popular Posts