దూత పాట పాడుడి - dhutha pata padudi song lyrics
దూత పాట పాడుడీ - రక్షకున్ స్తుతించుడి
ఆ ప్రభుండు పుట్టెను - బేత్లెహేము నందునన్
భూ జనంబుకెల్లను - సౌఖ్య సంభ్రమాయెను
ఆకసంబునందున - మ్రోగు పాట చాటుడి
దూత పాట పాడుడి - రక్షకున్ స్తుతించుడి
ఊర్ధ్వ లోక మందునన్ - గొల్వగాను శుద్ధులు
అంత్య కాల మందున - కన్య గర్భమందున
బుట్టునట్టి రక్షకా - ఓ ఇమ్మానుయేల్ ప్రభో
ఓ నరావ తారుడా - నిన్ను నిన్న శక్యమా ?
దూత పాట పాడుడి - రక్షకున్ స్తుతుంచుడి
దావే నీతి సూర్యుడా - రావే దేవ పుత్రుడా
నీదు రాక వల్లను - లోక సౌఖ్య మాయెను
భునివాసు లందరు - మృత్యు భీతి గెల్తూరు
నిను నమ్మిన వారికి ఆత్మ శుద్ధి కల్గును
దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి
Comments