దేవ సంస్తుతి చేయవే - deva samsthuthi cheyave manasa song lyrics

దేవ సంస్తుతి చేయవే మనసా - శ్రీ మంతుడగు యే హోవ సంస్తుతి చేయవే మనసా - దేవ సంస్తుతి చేయు మా నా జీవమా యెహోవా దేవుని పావనా నామము నుతించుమా  - నా యంతరంగము లో వసించు నో సమస్తమా                                                    " దేవ " 

1) జీవమా యోహావా నీకున్ - జేసిన మేళ్లన్ మరువకు = నీవు చేసిన పాతకంబులను  - మన్నించి జబ్బు లేవీయున్ లేకుండ జేయును ఆ కారణముచే                  " దేవ " 

2) చావు గోతి నుండి నిన్ను లెవనెత్తి దయను కృపను - జీవ కిరీటముగ వేయును - నీ శిరసు మీద జీవ కిరీటముగా వేయును - ఆ కారణముచే                           " దేవ "

3) యవ్వనంబు పక్షి రాజు - యవ్వనంబు వలెనే క్రొత్త - యవ్వనంబై వెలయునట్లుగా - మే లిచ్చు నీదు - భావమును సంతుష్టి పరచును గా ఆ కారణముచే 
                                                               " దేవ " 

4) ప్రభువు నీతి పనులు చేయున్ -  బాధితులకు న్యాయ మిచ్చున్ - విభుండు మార్గము తెలిపె మోషేకున్ - దన కార్యములను  విప్పె నిశ్రాయేలు జనమునకు - ఆ కారణముచే                                             " దేవ "    

5) అత్యధిక ప్రేమ స్వరూపి యైన దీర్ఘ శాంతపరుడు - నిత్యము వ్యాజ్యంబు చేయడు - ఆ కృపోన్నతుడు నీ పయినెపుడు  కోపముంచడు ఆ కారణముచే  " దేవ " 

6) పామరులమని ప్రత్యుప కార - ప్రతి ఫలంబుల్ పంప లేదు - భూమి కన్నా నాకసంబున్న - ఎత్తుండు దైవ ప్రేమ భక్తి జనులయందున ఆ కారణముచే            " దేవ " 

7) పడమటికి తూర్పెంత ఎడమో - పామరులకు మనకు నంత - ఎడమ కలుగ జేసి యున్నాడు - మన పాపములను ఎడమ గానే జేసి యున్నాడు - ఆ కారణముచే                                              " దేవ "

8) కొడుకుల పై దండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల యెడల జాలి పడును దేవుఁడు - తన భక్తి పరుల యెడల జాలి పడును దేవుండు - ఆ కారణముచే      " దేవ " 

9) మనము నిర్మిత మయిన రీతి తనకు తెలిసి యున్న సంగతి - మనము మంటి వారమంచును - జ్ఞాపకము చేసి
కొనుచు కరుణ చూపుచుండును  - ఆ కారణముచే                                                                          " దేవ " 

10) పరమ దేవ నిబంధనాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు - నిరతము ను కృప నిలిచి యుండును - యెహోవా నీతి తరములు పిల్లలకు నుండును ఆ కారణముచే  " దేవ " 







Comments

Popular Posts