చుక్క పుట్టింది యేలో - chukka puttindi yelo song lyrics
వాక్యమే శరీరధారి ఆయే
లోక రక్షకుడు ఉదయించే
పాపాన్ని శాపాన్ని తొలగింపను
రక్షకుడు భూవికేతెంచెను
ఊరు వాడా వీధులలో - లోకమంతా సందడంట
పాడెదము కొనియాడెదము -అరె పూజించి ఘనపరచెదమ్
చుక్క పుట్టింది యేలో యేలెలో - సందడి చేద్దామా యేలో
రాజు పుట్టినాడు యేలో యేలేలో - కొలవా పోదామాయేలో
2)
గొర్రెల విడచి మందను మరచి
గాబ్రియేలు వార్త విని వచ్చామమ్మ
గానములతో గెంతులు వేస్తూ
గగనాలంటేల ఘనపరచెదమ్
చీకటిలో కూర్చున్న వారి కోసం
నీతి నీతి సూర్యుడేసు ఉదయించె
పాపాన్ని శాపాన్ని తొలగింపను
పరమున చేర్చను అరుదెంచె
ఆ బాలుడే మా రాజు -రాజులకు రారాజు
ఇహం పరం అందరం - జగమంతా సందడి చేద్దాము
చుక్క పుట్టింది యేలో యేలేలో సందడి చేద్దాము యేలో
పొలమును విడచి యేలో యేలేలో పూజ చేద్దాము యేలో
3)
తారను చూసి తరలి వచ్చాము
తూర్పు దేశపు జ్ఞానులము
తన భుజముల మీద రాజ్యభారము ఉన్న
తనాయుడె వరో చూడ వచ్చామమ్మ
బంగారు సాంబ్రాణి బోళమును
బాలునికి మేము అర్పించాము
మా గుండెలో నీకేనయ్య ఆలయం
మా మదిలో నీకెనయ్యా సింహాసనం
ఈ బాలుడే మా రాజు - రాజులకు రారాజు
ఇహం పరం అందరం జగమంతా సందడి చేద్దాం
చుక్క పుట్టింది యేలో యేలేలో
సందడి చేద్దామా యేలో
జ్ఞాన దీప్తుడమ్మా యేలో యేలేలో
భువికెత్తించెనమ్మ యేలో
నేవే మా రాజు - రాజులకు రాజు
నిన్నే మేము కొలిచెదము
హోసన్నా పాటలతో నా హృదయం అర్పించి - హృదిలో
నిన్ను కొలిచి క్రిస్మస్ నిజ ఆనందం అందరం పొందెదం
Comments