చూచుచున్నాము నీ వైపు - chuchuchunnamu nee vaipu song lyrics

చూచుచున్నాము నీ వైపు నా ప్రియ జనక - చూచున్నాము నీ వైపు = చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను జాచుచు కరములు - చక్క గా నీ వైపు                      " చూచు " 

1) మేమరులమై యుంటిమి - మార్గము వీడి - మేందరము పోతిమి = ప్రేమ చే నప్పుడు - ప్రియ తనయునంపించి క్షేమ మార్గము మాకున్ బ్రేమను చూపితివి        " చూచు " 

2) నిను నమ్ము పాపులకు - వారెవరైన - నీ శరణున్ జొచ్చు వారలకు = ఇనున్డవు కేడెoబు నీ జగతిలో నగుచున్ - గను పరుచుచుందువు ఘనమైన నీ కృపన్       " చూచు " 

3) నీ భయము మా యెడలను - నిలుపుము నీదు - ప్రాభవ మొనరంగను = నీ భయముచే మేము వైభవ మొందుచు - నే భయము లేకుండ - నీ భువుని గొన్నాళ్లు 
                                                           " చూచు " 

4) దయ చూచి మము నెప్పుడు మంచివి యన్ని - దయచేయు మెల్లప్పుడు దయచేయ రానివి దయ చేయుమని కోరన్ - దయ చూపి మన్నించు దయగల మా తండ్రి                                                  " చూచు " 


Comments

Popular Posts