భజన చేయుచు భక్తి పాలక - bhajana cheyuchu bhakthi song lyrics

భజన చేయుచు భక్తి పాలక ప్రస్తుతింతు నీ నామమును వృజిన ములపై జయము నిచ్చిన విజయుడా నిను వేడు కొందు 

1) దివ్య పదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు - భవ్యమైన బాధలెన్నో బాగుగా ధర నేర్పినావు   " భజన " 

2) నరులన్ గావను పరము నుండి - ధరను నీవు వచ్చినావు పరుండ నైన నా కొరకు నీ ప్రాణము నర్పించినావు                                              " భజన " 

3) చెడిన వాడనైన నన్నున్ - జేరిదీసి బ్రోచినావు - పడిన నాదు గోతి నుండి పైకి లెవ నెత్తి నావు            " భజన " 

4) ఎంత ప్రేమ ఎంత దయ - ఎంత కృప యేసయ్య నీకు = ఇంతయని వర్ణింప నిలలో  నెవనికి ని  సాధ్యంబు గాదు 
                                                                 "భజన " 

Comments

Popular Posts