భజన చేయుచు భక్తి పాలక - bhajana cheyuchu bhakthi song lyrics
భజన చేయుచు భక్తి పాలక ప్రస్తుతింతు నీ నామమును వృజిన ములపై జయము నిచ్చిన విజయుడా నిను వేడు కొందు
1) దివ్య పదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు - భవ్యమైన బాధలెన్నో బాగుగా ధర నేర్పినావు " భజన "
2) నరులన్ గావను పరము నుండి - ధరను నీవు వచ్చినావు పరుండ నైన నా కొరకు నీ ప్రాణము నర్పించినావు " భజన "
3) చెడిన వాడనైన నన్నున్ - జేరిదీసి బ్రోచినావు - పడిన నాదు గోతి నుండి పైకి లెవ నెత్తి నావు " భజన "
4) ఎంత ప్రేమ ఎంత దయ - ఎంత కృప యేసయ్య నీకు = ఇంతయని వర్ణింప నిలలో నెవనికి ని సాధ్యంబు గాదు
"భజన "
Comments