అన్ని కాలంబుల నున్న యెహోవా - anni kalambula nunna yehova song lyrics
అన్ని కాలంబుల నున్న యెహోవా ని - నెన్న దరంబయో
కన్న తండ్రి - వన్నె కెక్కిన మోక్ష - వాసాలి సన్నుతు - లున్నతమై యుండ మున్నె నీకు
1) నిన్ను బ్రకటన సేయ - నిఖిల లోకములను బన్నుగన్ జేసిన బలుండ వీవే - ఉన్న లోకంబుల నుడుగక కరుణా సంపన్నతతో నేలు ప్రభుండ వీవే - యన్ని జీవుల నెఱిగి యాహార మిచ్చుచు నున్న సర్వ గ్నుo డవు నీవే ఎన్న శక్యము గాక - ఉన్న లక్షణముల సన్నుతిoచుటకు నే జాలుదునా " అన్ని "
2) పుట్టింప నీవంచు - బోషింప నీవంచు - గిట్టింప నీవంచు
గీర్తింతును నట్టి పనికి మాలి - నట్టి మానవులచే పట్టి రక్షింప బాద్యుండ వంచు = దట్టమైన కృపను దరి చేర్చ నాకిచ్చి పట్టయి నిలిచియుండు ప్రభుండ వంచు గట్టడ చే
గడ ముట్టు దనుకనా - పట్టు కొలన్ ది నిన్ను న్ బ్రస్తుతింతు " అన్ని "
3) కారుణ్య నిధి వీవు - కఠినాత్ము డను నేను - భూరి శుద్ధుడ వీవు - పాపి నేను = సార భాగ్యుడ వీవు - జగతిలో నాకన్న దారిద్రుడే లేడు తరచి చూడ = సారా సద్గుణముల
సంపన్నుడవు వీవు - ఘోర దుర్గుణ సం - చారి , నేను = ఏ రీతి స్తుతియింతు - నే రీతి సేవింతు - నేర మెన్నక ప్రోవ - నెర నమ్మితి " అన్ని "
Comments