యేసయ్య నీ ప్రేమ - yesayya nee prema song lyrics
యేసయ్యా నీ ప్రేమ నా సొంతము
నాలోన పలికిన స్తుతి గీతము
యేసయ్య నీవే గా తొలి కిరణము
నాలోన వెలిగిన రవి కిరణము
ఏనాడు ఆరని నా దీపము - నా జీవితానికి ఆధారము
ఇమ్మానుయేలుగా నీస్నేహము - నాలోన నిత్యము ఒక సంబరం
ఏ పాటి నను ప్రేమించినావు
నీ ప్రేమలోనే నను దాచావు
నా భారమంతా నువు మోసినావు
నన్నెంతగానో హెచ్చించి నావు
నీ కృపలోనే నను కాచినావు
నీ కనికరమే చూపించినావు
నా హృదిలోనే నీ వాక్య ధ్యానం
నా మదిలోనే నీ నామ స్మరణం
నిన్నే ఆరాధించి - నీ దయలోనే జీవించి
నిన్నే నే పూజించి - నీలోనే తరియించి " యేసయ్య "
ఏనాడు నను విడనాడ లేదు
నీ నీడ లొనే నను నడిపించినావు
లోకాలనేలే రారాజు నీవే నా జీవ నావకు రహదారి నీవే
నా గురి నీవే నా యేసు దేవా చేరితి నిన్నే నా ప్రాణ నాథ
పర్వత శిఖరం నీ మహిమ ద్వారం
ఉన్నతమైనది నీ దివ్య చరితం
సాటే లేరు నీకు - సర్వాధి కారివి నీవు
మారని దైవం నీవు - మహిమోన్నతుడవు నీవు
" యేసయ్య "
Comments