యేసయ్య కనికర పూర్ణుడా - yesayya kanikara purnuda song lyrics

యేసయ్య కనికరా పూర్ణుడా 
మనోహర ప్రేమకు నిలయుడా (2)
నీవే నా సంతోష గానము 
సర్వ సంపదలకు ఆధారము (2)       " యేసయ్య " 

నా వలన ఏదియు ఆశించ కయే ప్రేమించితివి 
నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి (2)
సిలువ మానుపై రక్తము కార్చి  రక్షించితివి 
శాశ్వత కృపా పొంది జీవింతును ఇల నీ కొరకే  (2) 
                                                   " యేసయ్య " 

నా కొరకు సర్వము ధారాలముగా దయచేయువాడవు 
దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి  (2)
అలసిన వారి ఆశను తృప్తి పరచితివి 
అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము (2) 
                                                   " యేసయ్య " 

నీ వలన బలము నొందిన వారే ధన్యులు 
నీ సన్నిధి అయిన సీయోనులో వారు నిలిచెదరు (2) 
నిలువరమైన రాజ్యములో నిను చూచుటకు 
నిత్యము కృప పొంది సేవించెదను తుది వరకు (2)
                                                  " యేసయ్య " 



Comments

Popular Posts