యేసయ్య కనికర పూర్ణుడా - yesayya kanikara purnuda song lyrics
యేసయ్య కనికరా పూర్ణుడా
మనోహర ప్రేమకు నిలయుడా (2)
నీవే నా సంతోష గానము
సర్వ సంపదలకు ఆధారము (2) " యేసయ్య "
నా వలన ఏదియు ఆశించ కయే ప్రేమించితివి
నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి (2)
సిలువ మానుపై రక్తము కార్చి రక్షించితివి
శాశ్వత కృపా పొంది జీవింతును ఇల నీ కొరకే (2)
" యేసయ్య "
నా కొరకు సర్వము ధారాలముగా దయచేయువాడవు
దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి (2)
అలసిన వారి ఆశను తృప్తి పరచితివి
అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము (2)
" యేసయ్య "
నీ వలన బలము నొందిన వారే ధన్యులు
నీ సన్నిధి అయిన సీయోనులో వారు నిలిచెదరు (2)
నిలువరమైన రాజ్యములో నిను చూచుటకు
నిత్యము కృప పొంది సేవించెదను తుది వరకు (2)
" యేసయ్య "
Comments