ఏపాటి దానానయా - ye pati dhaananaya song lyrics


ఏపాటిదాననయా  - నన్నింతగా హెచ్చించుటకు 
నేనెంతటి దాననయా - నా పై కృప చూపుటకు 
నా దోషము భరియించి - నా పాపము క్షమియించి 
నను నీలా మార్చుటకు - కలువరిలో మరణించి 
ప్రేమించే ప్రేమా మయుడా నీ ప్రేమకు పరిమితిలేదే 
కృప చూపు కృపగల దేవ నీ కృపకు సాటి ఏది
                                                          " ఏ పాటి "

కష్టాల కడలిలో - కన్నీటి లోయలలో 
నా తోడు నిలిచావు - నన్నాదరించావు 
అందరు నను విడిచిన - నను విడువని యేసయ్య 
విడువను ఎడబాయనని - నా తోడై నిలిచితివా 
                                                        " ప్రేమించే " 

నీ ప్రేమను మరువలేనయ్యా 
నీ సాక్షిగా బ్రతికేదనేసయ్యా  
నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా 
నేనొందిన ఈ జయము -  నీవిచ్చినదేనయ్యా 
నీవిచ్చిన జీవముకై - స్తోత్రము యేసయ్యా    
                                                        " ప్రేమించే " 

Comments

Popular Posts