ఏపాటి దానానయా - ye pati dhaananaya song lyrics
ఏపాటిదాననయా - నన్నింతగా హెచ్చించుటకు
నేనెంతటి దాననయా - నా పై కృప చూపుటకు
నా దోషము భరియించి - నా పాపము క్షమియించి
నను నీలా మార్చుటకు - కలువరిలో మరణించి
ప్రేమించే ప్రేమా మయుడా నీ ప్రేమకు పరిమితిలేదే
కృప చూపు కృపగల దేవ నీ కృపకు సాటి ఏది
" ఏ పాటి "
కష్టాల కడలిలో - కన్నీటి లోయలలో
నా తోడు నిలిచావు - నన్నాదరించావు
అందరు నను విడిచిన - నను విడువని యేసయ్య
విడువను ఎడబాయనని - నా తోడై నిలిచితివా
" ప్రేమించే "
నీ ప్రేమను మరువలేనయ్యా
నీ సాక్షిగా బ్రతికేదనేసయ్యా
నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా
నేనొందిన ఈ జయము - నీవిచ్చినదేనయ్యా
నీవిచ్చిన జీవముకై - స్తోత్రము యేసయ్యా
" ప్రేమించే "
Comments