విలువేలేని నా జీవితం - viluve leni naa jeevitham song lyrics

విలువే లేని నా జీవితం నీ చేతిలో పడగానే 
అది ఎంతో విలువని నాకు చూపితివే 
జీవమే లేని నాలో నీ - జీవమును నింపుటకు 
నీ జీవితాన్నే ధారబోసితివే   (2) 

నీది శాశ్వత ప్రేమయా నేను మరచిపోలేనయా 
ఎన్ని యుగాలైనా మారదు 
ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును 
నా దేవునికి సమస్తము సాధ్యమే (2) 

పాపములో పడిన నన్ను శోకములో మునిగిన నన్ను 
నీ ప్రేమతో లేపితివే 
రోగమే నన్ను చుట్టుకొని యుండగా 
రోదనతో ఒంటరినై యుండగా 
నా కన్నీటిని తుడిచితివే     (2)               " నీది శాశ్వత " 

పగలంతా మేఘ స్తంభమై రాత్రంతా అగ్ని స్తంభమై 
దినమంతయు రెక్కలతో కప్పితివే 
స్నేహితులే నన్ను వదిలేసిన 
బంధువులే భారమని తలచిన 
నా కొరకే బలి అయితివే    (2)                " నీది శాస్వత "

సాధ్యమే సాధ్యమే సాధ్యమే 
నా యేసుకు సమస్తము  
సాధ్యమే సాధ్యమే సాధ్యమే 
నా ప్రియునికి సమస్తము  (2) 

ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును 
నా దేవునికి సమస్తము సాధ్యమే (2)     " విలువే లేని " 



Comments

Popular Posts