వేటగాని ఉరిలో నుండి - veta gani urilo nundi song lyrics

వేట గాని ఉరిలో నుండి  నా ప్రాణాన్ని రక్షించావు 
బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు  (2) 

లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా 
ఆరాధనా ఆరాధనా నా తండ్రి నీకే ఆరాధనా 
ఆరాధనా ఆరాధనా నా యేసు నీకే ఆరాధనా (2) 

రాత్రి వేళ భయముకైనను
పగటి వేళ బాణమైనను 
రోగము నన్నేమి చేయదు
నా గుడారము సమీపించదు  (2)         " లెనేలేదయ్యా " 


వేయి మంది పడిపోయినా 
పది వేల మంది కూలిపోయినా 
అపాయము రానే రాదు 
నా గుడారము సమీపించదు (2)        " లెనేలేదయ్యా " 

మానవుల కాపాడుటకు 
నీ దూతలను ఏర్పరిచినావు 
రాయి తగుల కుండా 
ఎత్తి నన్ను పట్టుకున్నావు      (2)      " లెనేలేదయ్యా " 

.


Comments

Popular Posts