ఊహించలేను ప్రభు - uhinchalenu prabhu song lyrics

ఊహించలేను ప్రభు నీ మమతను 
వివరించలేను యేసు నీ ప్రేమను 
నువు లేక ఇలలో నే బ్రతికే దెలా 
ఎనలేని నీ ప్రేమను కొలిచేదెలా 

ఈ లోక గాయాలతో నిను చూడగా 
లోతైన నీ ప్రేమతో కాపాడగా 
కొరతంటూ లేదే ప్రభు నీ కరుణకు 
అలుపంటూ రాదే సదా నీ కనులకు 
ప్రతి దినం ప్రతి క్షణం - నీ ప్రేమ లేక పోతే నిరుపేదను 

నాలోని ఆవేదనే నిను చేరగా 
నా దేవా నీ వాక్యమే ఓదార్చగా 
ఘనమైన నీ నామమే కొనియాడనా 
విలువైన నీ ప్రేమనే నే పాడనా 
ఇదే వరం నిరంతరం 
నీతోనే సాగిపోనా - నా యేసయ్య 

Comments

Popular Posts