తూర్పు దిక్కు చుక్క పుట్టే - thurpu dhikku chukka putte song lyrics
తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మా (2)
చుక్కాను చూచి మేము వచ్చినాము మొక్కిపోవుటకు (2)
బేత్లెహేము పురము లోనబాలుడమ్మ
గొప్ప బాలుడమ్మ (2)
మన పాపములను బాప పుట్టెనమ్మా
మహిమవంతుడమ్మా (2)
పశువుల పాకలోని బాలుడమ్మా
పాప రహితుడమ్మా (2)
పాపంబు బాపను పుట్టెనమ్మా
సత్యవంతుడమ్మా (2)
బంగారం సాంబ్రాణి బోళము తీర్చినాము
బాల యేసు నొద్దకు (2)
బంగారు పాదముల మ్రొక్కెదము
బహుగా పాడేదము(2)
Comments