సుమధుర స్వరముల - sumadhura svaramula song lyrics

సుమధుర స్వరముల గానాలగో 
వేలాది దూతల గణములతో 
కొనియాడ బడుచున్న నా యేసయ్యా 
నీకే నా ఆరాధన (2) 

మహా ఆనందమే నాలో పరవశమే 
నిన్ను స్తుతించిన ప్రతి క్షణం  (2)      " సుమధుర

ఎడారి త్రోవలో నే నడిచిన
ఎరుగని మార్గములో నను నడిపిన 
నా ముందు నడిచిన జయ వీరుడా 
నా విజయ సంకేతమా (2)      
నీవే నీవే నా ఆనందము 
నీవే నీవే నా ఆధారము (2)             "సుమధుర " 

సంపూర్ణమైన నీ చిత్తమే 
అనుకూలమైన సంకల్పమే 
జరిగించుచున్నావు నను విడువక 
నా ధైర్యము నీవే గా (2) 
నీవే నీవే నా జయ గీతము 
నీవే నీవే నా స్తుతి గీతము (2)           " సుమధుర "

వేలాది నదులన్నీ నీ మహిమను 
తరంగపు పొంగులు నీ బలమును 
పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించు చున్నవి గా (2)
నీవే నీవే నా అతిశయము 
నీకే నీకే నా ఆరాధన  (2)                  " సుమధుర " 

Comments

Popular Posts