సుమధుర స్వరముల - sumadhura svaramula song lyrics
సుమధుర స్వరముల గానాలగో
వేలాది దూతల గణములతో
కొనియాడ బడుచున్న నా యేసయ్యా
నీకే నా ఆరాధన (2)
మహా ఆనందమే నాలో పరవశమే
నిన్ను స్తుతించిన ప్రతి క్షణం (2) " సుమధుర "
ఎడారి త్రోవలో నే నడిచిన
ఎరుగని మార్గములో నను నడిపిన
నా ముందు నడిచిన జయ వీరుడా
నా విజయ సంకేతమా (2)
నీవే నీవే నా ఆనందము
నీవే నీవే నా ఆధారము (2) "సుమధుర "
సంపూర్ణమైన నీ చిత్తమే
అనుకూలమైన సంకల్పమే
జరిగించుచున్నావు నను విడువక
నా ధైర్యము నీవే గా (2)
నీవే నీవే నా జయ గీతము
నీవే నీవే నా స్తుతి గీతము (2) " సుమధుర "
వేలాది నదులన్నీ నీ మహిమను
తరంగపు పొంగులు నీ బలమును
పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించు చున్నవి గా (2)
నీవే నీవే నా అతిశయము
నీకే నీకే నా ఆరాధన (2) " సుమధుర "
Comments