సుదూరము ఈ పయణము - sudhuramu ee payanamu song lyrics

సుదూరము ఈ పయణము ముందు ఇరుకు మార్గము 
యేసు నాకు తోడుగా నాతోనే నడుచు చుండగా 
నే వెంట వెళ్ళేదా నా రాజు వెంబడి 
సుమధుర భాగ్యము యేసుతో పయణము 

1) 
అలలపై నే నడచెదా తుఫానులో హుషారుగా 
ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు  నే తిరిగెదా
ఉల్లాసమే యేసుతో నా పయణమంతయు 
ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము 
ఒక్కొక్క అడుగులో ఓ కొత్త అనుభవం 

2)
హోరు గాలి వీచినా అలలు పైకి లేచినా
ఏ భయము నాకు కలుగదు నా పాదము తొట్రిల్లదు 
నా చెంతనే ఉన్న యేసు నన్ను మోయును 
ఇది నా భాగ్యము నాలోని ధైర్యము 
ఏ దిగులు లేకనే నే సాగిపోదును 

3)
నా జీవితము పదిలము యేసుని చేతిలో 
నా పయణము సఫలము యేసుదే భారము 
నే చేరేదా నిశ్చయముగా నా గమ్యము 
ఇది నా విశ్వాసము నాకున్న అభయము 
కృపగల దేవుడు విడువడు ఎన్నడూ 










Comments

Popular Posts